✒
*➖ఉద్యోగ సంఘాలను ఆహ్వనించిన సర్కారు.*
*➖24న సచివాలయంలో సీఎం భేటీ.*
*➖పాత సిఫారసులు, కొత్త సిఫారసుల సవరణ పై నిర్ణయం.*
*➖బకాయిలు, ఐ.ఆర్ 11వ కమిషన్ పై రానున్న స్పష్టత.*
ఉద్యోగుల వేతన సవరణ కమిటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే 24న చర్చించేందుకు ఉద్యోగ సంఘాలను ఆహ్వా నించింది. పీఆర్సీ విషయంలో ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బకాయిల చెల్లింపుతో పాటు కొత్త పీఆర్సీనియామకంపై సానుకూలంగా స్పందింది. రాష్ట్ర విభజనకు ముందు 2013లో ఏర్పాటైన పీఆర్సీ సిఫార్సుల నేప థ్యంలో దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకు ప్రభుత్వం బకాయి పడింది. ఒకవైపు నాలుగు సంవత్సరాలుగా బకాయిలు చెల్లించాలంటూ ఉద్యోగులు ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ, ఆర్థిక స్థితి నెపంతో ప్రభుత్వం కాలయాపన చేస్తూ వచ్చింది. అయితే మళ్ళీ పీఆర్ సిని వేసేందుకు గడువు సమీపించిన నేపథ్యంలో ఎట్టకేలకు మెట్టు దిగిన రాష్ట్ర ప్రభుత్వం బకాయిల చెల్లింపునకు అంగీకారం తెలపడం జరిగింది. అయితే ఈ మొత్తాన్ని ఉద్యోగులకు ఏవిధంగా చెల్లించాలనే అంశంపై సర్కారుకు స్పష్టత లేదు. విడతలవారీగా, లేదా నగదు రూపంలో చెల్లించాలనే దిశగా కసరత్తు చేస్తున్నప్పటికీ, ఉద్యోగ సంఘాలతో నేరుగా ఒక దఫా చర్చించిన అనం తరమే తుదినిర్ణయానికి రావాలనే యోచనలో ప్రభుత్వం వుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 24న ఉద్యోగ సంఘాలతో జరుగనున్న చర్చలకు ప్రాధాన్యత ఏర్పడింది. పాత
పి ఆర్ సి సిఫార్సులు, పెండింగ్' సమస్యలతో పాటు కొత్త పీఆర్ సిపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే విషయమైముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలని సంకల్పించారు.
ఫలితంగానే ఉద్యోగ సంఘాలు అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు వున్న సందేహాలను సైతం నివృత్తి చేసుకుంటారు. ప్రస్తుత ఆర్థిక స్థితిని వివరించి ఏ విధంగా వ్యవహరించాలనే విషయమైసంఘాల నుంచిసలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. కాగా మొత్తం తొమ్మిది నెలలకు సంబంధించిన పీఆర్ సి బకాయిలు ప్రభుత్వం వద్ద పెండింగ్లో వుండగా,చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయా అంటూ ఉద్యోగులు నాలుగేళ్లుగా ఎదురు చూస్తూవస్తున్నారు. సర్కారు ఆర్థికస్థితి తెలిసి కూడా ఎందుకు ఒత్తిడి తేవాలని కూడా మరికొన్ని ఉద్యోగ సంఘాలు తాత్సారం చేస్తూ వచ్చాయి. అయితే సాధారణ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో పీఆర్ సి బకాయిలకు సంబంధించి ఒకింత ఆందోళన నెలకొన్న తరుణంలో మంత్రివర్గ సమావేశంలో సానుకూల నిర్ణయం తీసుకోవడం జరిగింది.
*ఐ.ఆర్ కోసం పట్టు*
ప్రభుత్వంతో జరిగే చర్చలలో ఉద్యోగులు ఇంటరీం రిలీఫ్ ఫండ్ కోసం పట్టుబట్టనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే జూన్ 2 వ తేదీ నుంచి ఐ.ఆర్ ఇచ్చేందుకు ఉద్యోగులతో జరిగిన చర్చలలో అంగీకరించింది. అదేడిమాండును తమ భేటీలో కూడా చేయాలనే యోచనలో ఉద్యోగ సంఘాలున్నాయి. 2014 జులై 1వ తేదీ నుంచి 2015 మార్చి 31వ తేదీ వరకు తొమ్మిది నెలల పీఆర్ సి బకాయిలు ప్ర భుత్వం చెల్లించాల్సి వుంది. అదే విధంగా 10 పి ఆర్ సి సందర్భంగా వేతన సవరణలో లోటుపాట్లను సరిదిద్దేందుకు అనామలిస్ కమిటీని కూడా నియమించలేదు. ఈసారి అలాంటి పొరపాట్లు జరుగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు కోరనున్నాయి.అయితే పీఆర్ సి ప్రకటించిన అనంతరమే ఈ కమిటీని నియమించే ఆనవాయితీ వుండటంతో ఉద్యోగులతో భేటీలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందోననే ఆసక్తి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన పీఆర్సీని ప్రకటించింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి వద్ద ఉద్యోగ సంఘాలు ప్రస్తావించే అవకాశాలు న్నాయి. అదే విధంగా కమిషన్ ను నియమించిన వెంటనే సకాలంలో నివేదికను ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా వారు ముఖ్యమంత్రిని కోరనున్నారు.
10 వ పీఆర్సీ కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వి.కె.అగర్వాల్ వ్యవహరించారు. ఈసారి కూడా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నియమించేందుకు ప్రభుత్వం అన్వేషణ ప్రారంభించింది.
*సీపీఎస్ పథకం పై చర్చ*
ఇదిలా వుండగా రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదంగా మారిన కాంట్రిబ్యుటరీ పెన్షన్ స్కీంకు సంబంధించి ముఖ్యమంత్రితో భేటీలో దుమారం చెలరేగే అవకాశం వుంది. గత కేబినెట్ భేటీలో ఈ విషయమై అసంపూర్ణంగా చర్చ జరిగింది. అయితే ప్రభుత్వమే నేరుగా ఈ నెల 24న చర్చలు జరిగే అవకాశం వుండటంతో ఇందుకు సంబంధించి ఉద్యోగులు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దమ వుతున్నారని సమాచారం. ఈ సమావేశానికి ఏపీఎన్జీవోల సంఘం, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఉద్యోగుల జేఏసీ, సచివాలయ గెజిటెడ్ ఆఫీసర్లసంఘం, సెక్షన్ ఆఫీసర్ల అసోసియేషన్, స్టెనోల సంఘం వంటి అసోసియేషన్లను ఆహ్వానించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తో పాటు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం.రవిచంద్ర తదితరులు పాల్గొననున్నారు.
కిరణ్.
No comments:
Post a Comment